- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Women: మహిళలకు సురక్షితమైన నగరాలుగా ముంబై, విశాఖ
దేశంలో మహిళలకు సురక్షితమైన నగరాలుగా ముంబై, కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్‌లు నిలిచాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మహిళలకు సురక్షితమైన నగరాలుగా ముంబై, కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్‌లు నిలిచాయి. పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీలు తక్కువ సురక్షితమైనవని ఓ నివేదిక పేర్కొంది. నేషనల్ అన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ (NARI) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 31 నగరాల్లోని 12,770 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించారు. సురక్షితమైన నగరాల్లో మహిళలకు సమానత్వం, పౌర భాగస్వామ్యం, మెరుగైన పోలీసింగ్, వారికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పాట్నా, జైపూర్ వంటి నగరాల్లో పితృస్వామ్య నిబంధనలు, పట్టణ మౌలిక సదుపాయాలలో అంతరాలున్నాయి. మహిళల విషయంలో జాతీయ భద్రతా స్కోరు 65 శాతంగా ఉంది. సర్వే చేసిన ప్రతి 10 మంది మహిళల్లో ఆరుగురు తమ నగరంలో సురక్షితంగా ఉన్నారని చెప్పగా, 40 శాతం మంది అన్ సెక్యురిటీగా ఉన్నట్టు తెలిపారు. రాత్రిపూట ప్రజా రవాణా, సందర్శనా ప్రదేశాలలో మహిళలు సురక్షితంగా లేరని భావిస్తున్నారు. ఇక విద్యాసంస్థల్లో 86శాతం మంది మహిళలు పగటిపూట మాత్రమే సురక్షితంగా ఉన్నారని తేలింది.






