- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: మహిళ ఫోన్ కు అశ్లీల వీడియోలు.. పబ్లిక్ లో బస్సు డ్రైవర్ కు దేహశుద్ధి (వీడియో)
తన ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపుతున్న బస్సు డ్రైవర్ కు ఓ మహిళా ప్రయాణికురాలు దేహశుద్ధి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలను వేధిస్తున్న పోకిరీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పోలీసులు ఎంత మందిపై చర్యలు తీసుకున్నా కేటుగాళ్ళు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ మహిళ ఫోన్ కు అశ్లీల వీడియోలు పంపించిన ప్రైవేటు బస్సు డ్రైవర్ ను పబ్లిక్‍గానే ఓ మహిళ (woman attacks bus driver) చితక్కొట్టింది. మహారాష్ట్రలోని (Maharashtra) సింధుదుర్గ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు మహిళ కొన్ని నెలల క్రితం కంకవ్లిలోని ఒక ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీ కార్యాలయం ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకుంది. కంకవ్లి- ముంబయి మధ్య ప్రయాణాలు చేసేందుకు తరచుగా అదే కంపెనీ బస్సు సర్వీసును ఉపయోగించేంది. ఈ క్రమంలో టికెట్ బుకింగ్ రికార్డుల నుంచి ఆ మహిళ ఫోన్ నంబర్ ను తీసుకున్న బస్సు డ్రైవర్ మెసేజింగ్ యాప్ ల ద్వారా ఆమెకు అశ్లీల వీడియోలను పంపిస్తూ వేధించడం ప్రారంభించాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా ఆ డ్రైవర్ పదే పదే అదే రీతిలో ప్రవర్తిస్తుండటంతో ఇక అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె మరో మహిళతో కలిసి కంకవ్లి బస్ స్టాండ్ సమీపంలో ఉన్న బుకింగ్ కార్యాలయానికి వచ్చింది. అక్కడే ఉన్న డ్రైవర్ ను గుర్తించిన ఆ మహిళ తన ఫోన్ కు పంపిన బూతు సందేశాలను చూపిస్తూ అతడి చెంపలు వాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






