- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్
ఈ ఘటనపై వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.

దిశ, నేషనల్ బ్యూరో: హిందీ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. బాంద్రాలోని ఆయన నివాసం వెలుపల కాల్పులు సరిగ్గా ఏడాది క్రితం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి వర్లీలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, సల్మాన్ కారును బాంబుతో పేల్చేస్తామని ఆ బెదిరింపు మెసేజ్‌లో ఉంది. ఈ ఘటనపై వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. అధికారులు ప్రస్తుతం బెదిరింపు మేసేజ్ వచ్చిన వాట్సాప్ నంబర్, సంబంధిత వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. సల్మాన్ ఖాన్‌కు గత కొన్నేళ్ల నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. 1998 కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న లారెన్స్ బిష్ణొయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. కృష్ణజింకలను లారెన్స్ బిష్ణోయ్ వర్గం వారు పవిత్రంగా భావిస్తారు. వాటిని వేటాడటం అదే వర్గానికి చెందిన లారెన్స్‌కు నచ్చలేదు. ఈ కారణంగానే 2018 నుంచి సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ గ్యాంగ్ పనిచేస్తోంది. ఈ బెదిరింపులకు దృష్టిలో ఉంచుకుని సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ భద్రతను గతంలో చాలాసార్లు కట్టుదిట్టం చేశారు.






