కారులో ప్రియుడితో ఏకాంతంగా భార్య.. అద్దాలు పగులగొట్టి పట్టుకున్న భర్త (వీడియో)

by Disha Web Desk |
కారులో ప్రియుడితో ఏకాంతంగా భార్య.. అద్దాలు పగులగొట్టి పట్టుకున్న భర్త (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఫ్రీడమ్ ముసుగులో విచ్చలవిడిగా తిరుగుతూ ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా అక్రమ సంబంధం నేపథ్యంలో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త కళ్లుగప్పి ప్రియుడితో కార్లో ఎంజాయ్ చేస్తు్న్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు ఓ భర్త.

వీడియోలో ఉన్నదాని ప్రకారం.. హర్యానాలోని పార్క్‌లో పార్కింగ్ చేసిన కారులో ఓ జంట కూర్చోని ఏకాంతంగా గడుపుతోంది. ఇదే సమయంలో హాకీ బ్యాట్‌తో వచ్చిన వ్యక్తి కారు లైఫ్ట్ సైట్ విండో అద్దం ధ్వంసం చేసి డోర్ ఓపెన్ చేశాడు. వెంటనే దాంట్లో కూర్చున్న మహిళను బయటకు లాగి ఆమెపై బ్యాట్‌తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె ప్రియుడి మాత్రం కారు దిగి ఆ దాడిని అడ్డుకోకపోగా పార్క్‌లో వాకింగ్‌కు వచ్చిన వ్యక్తిలా ఏమీ పట్టనట్టుగా తిరిగాడు.

కాగా, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కళ్లు గప్పి ఇలా పార్కుల్లో షికార్ చేస్తుందని భర్త ఆరోపించారు. భార్యపై నిఘా వేసి ఈ రోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. అనంతరం ఆమెపై పంచ్‌కుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు, ప్రియురాలిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Next Story

Most Viewed