- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదు? తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఫైర్
కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగిన చిన్నారులు 20 మంది మరణించిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగిన చిన్నారులు 20 మంది మరణించిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ ఈ దగ్గుమందును తయారీ చేసింది. చిన్నారుల మరణాలతో.. దగ్గుమందుపై ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించగా.. అందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత విషపూరితమైన రసాయనమని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తాజాగా దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. కోల్డ్ రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీ అయిన శ్రీసన్ ఫార్మా యూనిట్ పై తమిళనాడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. కాఫ్ సిరప్ కారణంగా చిన్నారులు చనిపోయినా.. సదరు కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. కంపెనీపై క్రిమినల్ అభియోగాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. DCGI సూచించినా ఇంతవరకూ రద్దుచేయకపోవడంపై కేంద్రఆరోగ్యశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.






