Priyanka Gnadhi : మణిపూర్‌లో మోడీ ఎందుకు పర్యటించలేదు? : ప్రియాంక గాంధీ

by Muthe.Rajitha |

ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి అల్లర్లు(Riots) చెలరేగాయి.

Priyanka Gnadhi : మణిపూర్‌లో మోడీ ఎందుకు పర్యటించలేదు? : ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి అల్లర్లు(Riots) చెలరేగాయి. మణిపూర్‌(Manipur)లో నిన్న మైతేయి సంఘం అరంబై టెంగోల్ నాయకుడు కానన్ సింగ్‌తో సహా ఐదుగురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో మరోసారి హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఈ అరెస్టులతో ఇంఫాల్ వ్యాలీలోని ఐదు జిల్లాలు (ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్, బిష్ణుపూర్, కక్చింగ్)లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. దీంతో అధికారులు ఈ జిల్లాల్లో కర్ఫ్యూ విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) స్పందించారు.

రెండేళ్లుగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే ప్రధాని మోడీ(PM Modi) ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా అక్కడ ఎందుకు శాంతి నెలకొనడం లేదని ప్రధానిని నిలదీశారు. మణిపూర్‌లో 2023 మే 3 నుంచి మైతేయి (ఇంఫాల్ వ్యాలీలో ఆధిపత్య జాతి) మరియు కుకీ-జో (పర్వత ప్రాంతాల్లో నివసించే గిరిజనులు) సమాజాల మధ్య హింస కొనసాగుతోంది. ఈ గొడవల్లో 258 మంది మరణించగా.., 60,000 మంది కనబడకుండా పోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Next Story