భారీ వర్షం.. పూర్తిగా నీటిలో మునిగిపోయిన కారు, బస్సు.. ఎక్కడంటే?(వీడియో)

by Jakkula.Mamatha |

దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షం.. పూర్తిగా నీటిలో మునిగిపోయిన కారు, బస్సు.. ఎక్కడంటే?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని కాంట్ ప్రాంతం నీట మునిగి పోయింది. నిన్న(శనివారం) అర్థరాత్రి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు వేసవి నుంచి కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. పలు ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

నిన్న రాత్రి ఢిల్లీ(Delhi)లో కురిసిన భారీ వర్షాని(Heavy Rains)కి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా.. ఢిల్లీ కాంట్ ప్రాంతం వరదల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళుతున్న ఒక కారు మరియు బస్సు నీటిలో మునిగిపోయాయి. వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో కారు పూర్తిగా మునిగిపోయింది.

బస్సు కూడా సగం నీటిలో మునిగిపోయింది. ఆ మార్గం జలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. IMD ప్రకారం.. ఢిల్లీ NCR లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని అంచనా. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Meteorological department) అధికారులు సూచించారు.

వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Next Story