- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో అందుబాటులోకి E-85 పెట్రోల్.. దీని ప్రత్యేక ఏంటంటే?
భారత్‌లోకి కొత్తరకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అదే E-85 పెట్రోల్.. ప్రస్తుతం ఈ పెట్రోల్ ను ఢిల్లీలో అందుబాటులోకి తీసుకువచ్చారు. సీఎన్‌జీ కంటే తక్కువ ధరలో ఈ పెట్రోల్ అందుబాటులో ఉండటం విశేషం. దీనిని లీటర్ రూ.82కు అమ్ముతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లోకి కొత్తరకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అదే E-85 పెట్రోల్.. ప్రస్తుతం ఈ పెట్రోల్ ను ఢిల్లీలో అందుబాటులోకి తీసుకువచ్చారు. సీఎన్‌జీ కంటే తక్కువ ధరలో ఈ పెట్రోల్ అందుబాటులో ఉండటం విశేషం. దీనిని లీటర్ రూ.82కు అమ్ముతున్నారు. ఇది సాధారణ పెట్రోల్ కంటే భిన్నమైన ఒక ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్. ప్రస్తుతం మనదేశంలో వాడే పెట్రోల్ లో ఇతనాల్ శాతం కేవలం 10 నుండి 20 శాతం మాత్రమే ఉంటుంది. కానీ ఈ E-85 ప్రెట్రోల్ లో 85శాతం ఇథనాల్ ఉంటే, 15శాతం గ్యాసోలిన్ ఉంటుంది. ఇథనాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇథనాల్ అనేది చెరుకు, మొక్కజొన్న నుండి తయారు అవుతుంది. కాబట్టి సాధారణ పెట్రోల్ తో పోలిస్తే ఈ E-85 తక్కువ కార్బన్ మోనాక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది.
దీని వల్ల కాలుష్యం తగ్గుతుంది. అంతే కాకుండా దీనికి అధిక ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది. ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటే ఇంజిన్‌లో నాకింగ్ సమస్య ఉండదు. ఈ పెట్రోల్ వాడకం వల్ల ఇంజిన్ శక్తి పెరుగుతుంది. అందువల్ల రేసింగ్ కార్లు, హై పెర్ఫామెన్స్ ఇంజిన్లలో దీనిని వాడేందుకు ఇష్టపడుతుంటారు. ఇథనాల్ కు త్వరగా ఆవిరి అయ్యే గుణం ఉండటం వల్ల ఇంజిన్ లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇది ఇంజిన్ వేడెక్కకుండా కాపాడుతుంది. ఇక ఇథనాల్ లో పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి మైలేజీ కూడా 20 నుండి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అంతే కాకుండా సాధారణ పెట్రోల్ ఇంజిన్లలో దీనిని వాడలేము. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన (FFV) Flex-Fuel Vehicles అవసరం అవుతాయి. ఈ ఇంజిన్లు పెట్రోల్ లేదా E-85 రెండింటితోనూ నడవగలవు. ఇక వాతావరణ కాలుష్యం దృష్యా భారత్ సైతం దీని వాడకాన్ని పెంచేలా ప్రోత్సహించాలని చూస్తోంది.






