- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెంచరీకి చేరువలో రాహుల్.. 99 ఓటములతో రికార్డ్ అంటూ BJP సెటైర్
ఎన్నికల ఫలితాల వేళ రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు వేసింది. రెండు దశాబ్దాల్లో 99 ఓటములతో రాహుల్ రికార్డు సృష్టించారంటూ ఎద్దేవా చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై BJP సెటైర్ వేసింది. దేశ వ్యాప్తంగా 2 దశాబ్దాల కాలంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో 99 ఓటములతో రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఒక క్రీడ అయితే Rahul Gandhi పేరు మీద ఎవరూ ముట్టుకోలేని రికార్డు ఉంది. రాష్ట్రాలు మారినా, సంవత్సరాలు మారినా ఫలితం దాదాపుగా మారదు. ఆర్భాటంగా ప్రచారాలతో నినాదాలను మార్చినా ఫలితం ఎప్పుడూ ఒకటే. ఓటమి. Well Done రాహుల్ అంటూ ఎక్స్ వేదికగా సెటైర్ వేసింది. కాగా ఎన్నికలకు ముందు అస్సాం పర్యటనలో రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ఉద్దేశిస్తూ.. ‘ఆ పార్టీ యువరాజుకు వందోసారి కూడా ఓటమి తప్పదు’ అని ఎద్దేవా చేశారు.






