కేంద్రం వార్నింగ్‌తో దిగొచ్చిన మస్క్.. యూజర్లకు షాకిచ్చే ప్రకటన

by Naga Rani Yarlagadda |

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా గ్రోక్ నుంచి అశ్లీల కంటెంట్ బయటకు వస్తుండటంపై కేంద్రం సిరియస్ అయింది.

కేంద్రం వార్నింగ్‌తో దిగొచ్చిన మస్క్.. యూజర్లకు షాకిచ్చే ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐ వచ్చాక సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు, వీడియోల్లో ఏది నిజమో, ఏది ఏఐ క్రియేషనో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పైగా అశ్లీల చిత్రాల వాడకం పెరిగింది. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎక్స్ కు చెందిన గ్రోక్ ద్వారా అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ ను సృష్టించడం, దానిని వ్యాప్తి చేయడాన్ని అరికట్టాలని ఆదేశించింది. దీనిపై 72 గంటల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టును సమర్పించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రం ఆదేశాలపై ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ కార్ప్ స్పందించింది. చట్ట విరుద్ధమైన, అశ్లీల, ముఖ్యంగా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM)కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నామని తెలిపింది. అవసరమైతే స్థానిక ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తామని ఎక్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. చట్టవిరుద్ధమైన, అశ్లీల కంటెంట్ కోసం గ్రోక్ ను వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మస్క్ పోస్టు పెట్టగా.. దానిపై ఎక్స్ సేఫ్టీ బదులిచ్చింది. గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ కూడా దీనిపై స్పందించింది. చట్ట విరుద్ధమైన కంటెంట్ ఉన్న అకౌంట్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది.

Next Story