వార్ ఎఫెక్ట్‌తో కండోమ్‌ల కొరత... భారీగా తగ్గిన తయారీ

by Malleboina Mahesh |

యుద్ధం కారణంగా సిలికాన్ ఆయిల్, అమ్మోనియా కొరతతో తగ్గిన కండోమ్ ఉత్పత్తి. హార్ముజ్ మూసివేతతో రవాణా నిలిచి ధరలు పెరిగే అవకాశం.

వార్ ఎఫెక్ట్‌తో కండోమ్‌ల కొరత... భారీగా తగ్గిన తయారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పై ఆదారపడిన అనేక వస్తువుల కొరత ఏర్పడుతుంది. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల జీవితాలపై రకరకాలుగా ప్రభావం చూపుతోంది. తాజాగా కండోమ్‌ల తయారీ (Manufacturing of condoms)పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కండోమ్‌ల తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ (Silicone oil) కొరత ఏర్పడడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.

దీనికి తోడు కండోమ్ (Condom) చిరిగిపోకుండా ఉండటానికి ఉపయోగించే అమ్మోనియా ధరలు 40 శాతానికి పైగా పెరగడం తయారీదారులకు పెను భారంగా మారినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలుగా గల్ఫ్ దేశాల (Gulf countries) నుంచే సుమారు 86 శాతం అమ్మోనియా దిగుమతి అవుతుంది. అయితే హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో రవాణా నిలిచిపోయి సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణా ఇబ్బందుల వల్ల రానున్న రోజుల్లో కండోమ్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story