- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf: వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావన అయినప్పటికీ అది ఇస్లాంలో కీలక భాగం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ (waqf) అనేది ఇస్లామిక్ భావన అయినప్పటికీ అది ఇస్లాంలో కీలక భాగం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme court) కు తెలిపింది. వక్ఫ్ అనేది దాతృత్వం తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులు లౌకిక విధులను మాత్రమే నిర్వహిస్తాయని తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం వరుసగా రెండో రోజూ విచారణ జరిగింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Thushar mehatha) కోర్టులో వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది ఇస్లాంలో కేవలం దాతృత్వం తప్ప మరొకటి కాదని తెలిపారు. ‘దాతృత్వం అన్ని మతాల లక్షణం. క్రైస్తవులు కూడా దానిని అనుసరించొచ్చు. హిందూ మతంలో, విరాళాల నిర్మాణాత్మక వ్యవస్థ ఉంది. సిక్కు సమాజం కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తుంది’ అని తెలిపారు.
ప్రభుత్వ భూమిపై ఎవరికీ ఎటువంటి హక్కు ఉండబోదని, అది వినియోగదారుడి వక్ఫ్ ఆధారంగా ఉన్నప్పటికీ ఎటువంటి రైట్స్ ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని దానిని వక్ఫ్‌గా ప్రకటించినప్పటికీ దానిని తిరిగి తీసుకునే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులు ఉండటాన్ని మెహతా సమర్థించారు. వారు వక్ఫ్ బోర్డులో ఉండటం వల్ల మతపరమైన కార్యకలాపాలు ఏ మాత్రం ప్రభావితం కాబోవని తెలిపారు. కాగా, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే.






