- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వక్ఫ్ బోర్డు అధికారుల తలలు నరుకుతామంటూ బెదిరింపులు!
మధ్యప్రదేశ్‌లో ఆర్ఎస్ఎస్ మార్చ్‌ను స్వాగతించినందుకు.. వక్ఫ్ బోర్డు అధికారుల తలలు నరుకుతామంటూ బెదిరింపులు వచ్చాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను చంపేస్తామని ఆన్‌లైన్‌లో బెదిరింపులు వస్తున్నాయి. దసరా సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించిన మార్చ్‌ను స్వాగతించినందుకు వారి తలలు నరుకుతామని కొందరు వార్నింగ్స్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అక్డోబరులో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భోపాల్‌లో భారీ ఎత్తున మార్చ్‌లు చేశారు.
ఈ క్రమంలో టోప్‌ఖానా ప్రాంతంలో మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఒక రిసెప్షన్ పాయింట్ నిర్వహించింది. ఇక్కడ ఆర్ఎస్ఎస్‌ను స్వాగతించిన వీడియోను వక్ఫ్ బోర్డు చైర్మన్ డాక్టర్ సాన్వర్ పటేల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన కొందరు మతఛాందసవాదులు.. వక్ఫ్ బోర్డుతోపాటు తమపై కూడా వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో దాడులు చేశారని డాక్టర్ పటేల్ తెలిపారు. తనతోపాటు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఫైజన్ ఖాన్ తలలు నరుకుతామని బెదిరించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.






