Volcano : ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 6 కిమీల ఎత్తుకు ఎగిరిన బూడిద

by Muthe.Rajitha |

ఇండోనేషియా(Indonesia)లో ఓ అగ్నిపర్వతం బద్దలవ్వడంతో(Volcano Erupts).. 6 కిమీల మేర ఎత్తుకు బూడిద ఎగిసిపడింది.

Volcano : ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 6 కిమీల ఎత్తుకు ఎగిరిన బూడిద
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండోనేషియా(Indonesia)లో ఓ అగ్నిపర్వతం బద్దలవ్వడంతో(Volcano Erupts).. 6 కిమీల మేర ఎత్తుకు బూడిద ఎగిసిపడింది. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపం(Flores Island)లోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం(Levotoby Laki-Laki Volcano) సోమవారం ఉదయం విస్పోటనం చెందింది. దీంతో అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ విస్పోటనంలో 1.2 కి.మీ. నుంచి 6 కి.మీ. ఎత్తుకు బూడిద దట్టమైన మేఘంలా ఎగసిపడింది. దట్టమైన బూడిద కారణంగా సమీప గ్రామాల నుంచి నివాసితులను ఖాళీ చేయించారు. సమీప గ్రామాలను లావా బూడిద కమ్మేయగా.. అక్కడి గ్రామాలు చీకటిగా మారడంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేషియా వోల్కనాలజీ ఏజెన్సీ అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిని నిషేధిత జోన్‌గా ప్రకటించింది.

శ్వాసకోశ సమస్యలు రాకుండా ఫేస్‌మాస్క్‌లు ధరించాలని సూచించింది. విమానాల రాకపోకలు నిలిపివేసి రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా ఈ అగ్నిపర్వతం ఇండోనేషియా యొక్క 130 క్రియాశీల అగ్నిపర్వతాలైన "రింగ్ ఆఫ్ ఫైర్"(Ring Of Fire)లో ఉండి, తరుచూ విస్పోటనాలకు గురవుతోంది.

Next Story