- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీ అరేబియా తదుపరి రాయబారిగా ‘విపుల్’ నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన విదేశాంగ శాఖ
దౌత్యపరమైన వ్యవహరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాల దౌత్య విభాగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఖతార్ దేశంలో భారత రాయబారిగా సేవలందిస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్ (IFS) అధికారి హెచ్ఈ శ్రీ విపుల్ (Vipul)ను.. సౌదీ అరేబియా రాజధానికి భారత తదుపరి రాయబారిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) కాసేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఖతార్‌లో భారత రాయబారిగా శ్రీ విపుల్ విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య బంధాలను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనను అత్యంత ప్రాధాన్యత కలిగిన సౌదీ అరేబియాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన త్వరలోనే సౌదీ అరేబియాలో భారత రాయబారిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారని విదేశాంగ శాఖ పేర్కొంది.
గల్ఫ్ దేశాల్లో దౌత్య అనుభవం..
భారత విదేశాంగ సేవల్లో (IFS) సుదీర్ఘ అనుభవం ఉన్న విపుల్, గతంలో దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా కూడా పనిచేశారు. గల్ఫ్ దేశాల రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై ఆయనకు ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకునే కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది.






