- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ గెలుపు దిగ్భ్రాంతికరం.. ఈ తరహా మార్పులు దేశానికే ప్రమాదకరం: జయప్రకాశ్ నారాయణ
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుపై జేపీ కీలక వ్యాఖ్యలు చేశారు. జన్ జీ కోరుకుంటున్న మార్పులు దేశానికే ప్రమాదకరమన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. యావత్ దేశాన్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఊహించని రీతిలో విజయ్ టీవీకే పార్టీ (తమిళగ వెట్రి కళగం) అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళ రాజకీయాల్లో సంచలనం రేపిన విజయ్ అండ్ పార్టీ విజయంపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే విజయ్ సీఎం పీఠాన్ని చేరుకుంటాడని తాను ఊహించలేదన్నారు. ఈ ఫలితాలు చూసి తాను చాలా దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
తమిళనాడులో మంచి పాలన అందిస్తున్న స్టాలిన్ ఘోర ఓటమి పాలవ్వడంతో తాను షాకయ్యానని తెలిపారు. ప్రజలు విజయ్ వైపు మొగ్గుచూపడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ముఖ్యంగా జన్ జీ తరానికి చెందిన యువత.. వెంటనే అద్భుతాలు జరిగిపోవాలని ఆశిస్తున్నారని, ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ ఒక్కరోజులోనే అన్నీ మార్చేసినట్లు.. రియల్ లైఫ్ లోనూ క్షణాల్లో మార్పు రావాలని ఆశిస్తున్నారన్నారు. ఈ తరహా ఆలోచనా విధానం చాలా ప్రమాదకరమని, అభివృద్ధికి సమయం పడుతుందన్నారు. మార్పు కోరుకోవడం మంచిదే అయినా.. అది వెంటనే జరగాలనుకోవడం దేశానికి మంచిది కాదన్నారు. ఇక స్టాలిన్ ఓటమి వెనుక కుట్రలు, వ్యూహాలు ఉండి ఉండొచ్చన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పరిణామంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని, లేదంటే దేశం ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు.






