- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప రాష్ట్రపతి రాజీనామా ఆమోదం.. ప్రధాని నరేంద్ర మోడీ సెన్సేషనల్ ట్వీట్
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) పంపగా ఇవాళ ఆమె పరిశీలించి ఆమోదించింది. ఉప రాష్ట్రపతి రాజీనామా రాజ్యాంగంలోని 67(A) అధికరణ కింద తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్వర్తుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఇనాళ్లు ఉప రాష్ట్రపతిగా సేవలందించిన జగదీప్ ధన్‌ఖడ్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అనారోగ్యంతో భాధపడుతోన్న ఆయన పూర్తిగా కోలుకోవాలని కామెంట్ చేశారు. జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి సహా అన్ని పదవులతో దేశానికి అనేక సేవలందించారని కొనియాడారు. ఆయనకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.






