పెళ్లి చేసుకుంటానని మాటతప్పితే అత్యాచారం కాదు..!

by Phanindra |

పెళ్లి చేసుకుంటానని మాటతప్పితే అత్యాచారం కాదు అని ఉత్తరాఖండ్ హైకోర్టు తేల్చిచెప్పింది.

పెళ్లి చేసుకుంటానని మాటతప్పితే అత్యాచారం కాదు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పితే, దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. ఇద్దరు మేజర్లు అంగీకారంతో రిలేషన్‌లో ఉండి.. ఆ తర్వాత పెళ్లిచేసుకుంటాననే మాట తప్పితే దాన్ని ఐపీసీ సెక్షన్ 376 లైంగిక దాడిగా గుర్తించలేమని కోర్టు పేర్కొంది. ఆరంభంలో మాట ఇవ్వడమే మోసపూరితంగా జరిగిందని నిరూపించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ముస్సోరీకి చెందిన ఒక యువతి.. సూరజ్ బోరా అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత మాట తప్పాడని కేసు వేసింది. ఈ కేసును హైకోర్టులో సూరజ్ సవాలు చేశారు. ‘సంబంధం మొదట్లో నిందితుడు మోసం చేయాలని అనుకున్నట్లు కనిపించలేదు. ఇది కేవలం ఒక విఫలమైన బంధం మాత్రమే. ఈ విషయంలో క్రిమినల్ కేసు వేయడమనేది న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే’ అని కోర్టు పేర్కొంది.

Next Story