ట్రంప్-పుతిన్ భేటీ ఫెయిలైతే భారత్‌పై మరిన్ని సుంకాలు!

by Phanindra |   (  Updated:2025-08-14 17:36:15  IST  )

ట్రంప్-పుతిన్ భేటీ ఫెయిలైతే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ ఇద్దరు నేతలు అలస్కా వేదికగా కలవనున్నారు.

ట్రంప్-పుతిన్ భేటీ ఫెయిలైతే భారత్‌పై మరిన్ని సుంకాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: అలస్కా వేదికగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బీసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్-పుతిన్ చర్చలు కనుక విఫలమైతే భారత్‌పై వేస్తున్న సుంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుతం భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్న యూఎస్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అదనపు సుంకాలు ఆగస్టు 23 నుంచి అమలవుతాయి. ఇలాంటి సమయంలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమై, ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే ఈ సుంకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బీసెంట్ అనడం చర్చనీయాంశంగా మారింది.

కంట్రోల్ చేయడం కష్టం..

ఇదే క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన స్కాట్ బీసెంట్.. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై స్పందించారు. డీల్ కోసం చేస్తున్న చర్చల్లో భారత్ తమ నిబంధనలు ఒప్పుకోవడం లేదని, వారిని ఒప్పించడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, ఆగస్టు 25న యూఎస్ నెగోషియేటర్లు భారత్‌కు వస్తారని, అప్పుడే యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌పై చర్చలు మళ్లీ మొదలవుతాయని తెలుస్తోంది.

Next Story