- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనాపై 200 శాతం టారిఫ్ విధిస్తాం.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
చైనాపై 200 శాతం టారిఫ్ విధిస్తాం అని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు అయస్కాంతాల సరఫరా తగ్గినందుకే ఇలా అన్నట్లు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: చైనాపై 200 శాతం సుంకాలు విధిస్తానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. యూఎస్‌కు అయస్కాంతాలు కావాలని, అవి ఇవ్వకపోతే చైనాపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ‘వాళ్లు మనకు అయస్కాంతాలు ఇవ్వాల్సిందే. అవి ఇవ్వకపోతే వాళ్లపై 200 శాతం సుంకాలు వేయడమో లేదంటే ఇంకేదైనా కఠిన నిర్ణయమో తీసుకుంటా. యూఎస్-చైనా మధ్య మంచి సంబంధాలున్నాయి. కానీ మా దగ్గరే ఎక్కువ పరపతి, అధికారం ఉన్నాయి. నా దగ్గర ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి వాడితే చైనా తట్టుకోలేదు. నాశనం అయిపోతుంది. అవి నేను వాడటం లేదంతే’ అని తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ పోస్ట్ చేశారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ దేశం నుంచి ఎగుమతయ్యే అయస్కాంతాలు, ఇతర ఖనిజాలపై ఆంక్షలు విధించింది. చైనాపై యూఎస్ భారీ సుంకాలు విధించడంతో ప్రతీకారంగానే డ్రాగన్ కంట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య చర్చల తర్వాత అయస్కాంతాలు పంపేందుకు చైనా అంగీకరించింది. అదే సమయంలో చైనాపై సుంకాలు తగ్గించడంతోపాటు వారి విద్యార్థులు యూఎస్‌కు వచ్చేందుకు ట్రంప్ అనుమతించారు.






