ఇరాన్‌లో పాలకులను మార్చేందుకు యుద్ధం చేయలేదు: అమెరికా రక్షణశాఖ ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-02 13:34:59  IST  )

యుద్ధంపై అమెరికా రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది.

ఇరాన్‌లో పాలకులను మార్చేందుకు యుద్ధం చేయలేదు: అమెరికా రక్షణశాఖ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధంపై అమెరికా రక్షణశాఖ(US Defense Department) కీలక ప్రకటన చేసింది. ‘మేము ఇంకా యుద్ధం ప్రారంభించలేదు.. అయినా ముగింపు పలికేందుకు సిద్ధంగానే ఉన్నాం. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగానే ప్రవర్తించింది. అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూనే వచ్చింది. కనీసం ఖమేని మా హెచ్చరికలను కూడా లెక్కచేయలేదు. పైగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ చేతిలో చావు తప్పదని అన్నారు. తీరా చూస్తే యుద్ధంలో ఖమేని చనిపోయారు. ఈ యుద్ధం కారణంగా ఇరుపక్షాలకు భారీ నష్టం జరుగుతోంది. మేము ఇరాన్‌లో పాలకులకు మార్చేందుకు యుద్ధం చేయడం లేదు. కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే యుద్ధం చేశాం. ఇక ఇది సరైంది కాదు అనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధితో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఖమేనీ నన్ను చంపేలోపే నేను అతడిని అంతమొందించాను వారు రెండుసార్లు నాపై కుట్ర చేశారు.. కానీ నేను వారికంటే ముందే పని ముగించాను" అని ట్రంప్ గర్వంగా చెప్పుకొచ్చారు. 2024లో ట్రంప్‌పై జరిగిన రెండు హత్యాయత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందని నిఘా వర్గాల అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ అనుమానాలు నిజమే అని అర్థం అవుతోంది.

Next Story