నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. సంచలనం రేపుతోన్న UPSC పేపర్ లీక్ ఘటన

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-17 16:32:51  IST  )

గుజరాత్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025 పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ పేపర్ రూ. 30,000కి విక్రయించబడిందని నివేదికలు చెప్తున్నాయి. ఈ లీక్ మే 25, 2025న అంటే.. పరీక్షకు ఒక రోజు ముందు రాజ్‌కోట్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. సంచలనం రేపుతోన్న UPSC పేపర్ లీక్ ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025 పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ పేపర్ రూ. 30,000కి విక్రయించబడిందని నివేదికలు చెప్తున్నాయి. ఈ లీక్ మే 25, 2025న అంటే.. పరీక్షకు ఒక రోజు ముందు రాజ్‌కోట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి 300 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ రాష్ట్రం నుంచే అత్యధికంగా అర్హత సాధించడంతో.. అభ్యర్థుల మధ్య అనుమానాలు తలెత్తాయి. అంతేకాదు ట్రిప్లెట్ వివాదం.. కొన్ని పరీక్షా కేంద్రాల నుండి వరుస రోల్ నంబర్లు అర్హత సాధించడం.. పేపర్‌లోని అస్పష్టమైన ప్రశ్నలు ఆరోపణలకు దారితీశాయి. అయితే యూపీఎస్సీ ప్రశ్నాపత్రాలు నిపుణులచే తయారు చేయబడతాయని.. అస్పష్టమైన ప్రశ్నలను నిపుణుల సలహాతో తొలగిస్తామని పేర్కొంది. లీక్ గురించి యూపీఎస్సీ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

LINK

Next Story