Black Magic : ధనవంతులు కావడానికి తాంత్రిక పూజలు.. దారుణ హత్య

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : యూట్యూబ్‌(YouTube) చూసి తాంత్రిక విద్య(black magic)ను నేర్చుకున్నానంటూ బుకాయించాడు.

Black Magic : ధనవంతులు కావడానికి తాంత్రిక పూజలు.. దారుణ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో : యూట్యూబ్‌(YouTube) చూసి తాంత్రిక విద్య(black magic)ను నేర్చుకున్నానంటూ బుకాయించాడు. మనిషి పుర్రె ఉంటే తాంత్రిక పూజలు చేసి రూ.60 కోట్ల దాకా సంపాదిస్తానంటూ నమ్మబలికాడు. వికాస్ అలియాస్ పరమాత్మ (28) అనే వ్యక్తి ఈ మాయ మాటలతో వికాస్ గుప్తా (24), ధనుంజయ్ (25) అనే యువకులను రెచ్చగొట్టాడు. రాజు షా (29) అనే యువకుడిని హత్య చేసి పుర్రెను తీసుకొచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. బిహార్‌కు చెందిన వికాస్ గుప్తా, ధనుంజయ్ ఢిల్లీలో ఈ-రిక్షా నడుపుకునేవారు. వికాస్ అలియాస్ పరమాత్మ ఇచ్చిన సుపారీకి అంగీకరించిన వికాస్ గుప్తా, ధనుంజయ్‌లు.. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరప్రదేశ్‌(UP)లోని గజియాబాద్‌(Ghaziabad)లో రాజు షాను దారుణంగా హత్య చేశారు.

అతడి తలను తీసుకొని.. మొండేన్ని డ్రైనేజీలో పారేసి పరారయ్యారు. రాజు షా మొండేన్ని తాంత్రిక పూజల కోసం వికాస్ అలియాస్ పరమాత్మకు ఇచ్చారు. ఆ మొండేన్ని వికాస్ అలియాస్ పరమాత్మ తీసుకెళ్లి నరేంద్ర అనే వ్యక్తికి ఇచ్చాడు. అనంతరం దాన్ని నరేంద్ర తీసుకెళ్లి పంకజ్, పవన్ అనే వ్యక్తులకు అప్పగించాడు. కొన్ని రోజుల తర్వాత రాజుషా పుర్రె కూడా గజియాబాద్‌లోని డ్రైనేజీలో కనిపించింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈనెల 7న కీలక నిందితుడు వికాస్ అలియాస్ పరమాత్మను అరెస్టు చేశారు. అతడిని ఇంటరాగేట్ చేయగా పైవివరాలన్నీ చెప్పాడు. ఇక రాజుషాను హత్య చేసిన వికాస్ గుప్తా (24), ధనుంజయ్ (25)లను ఈ ఏడాది ఆగస్టులోనే అరెస్టు చేశారు. రెండు నెలల క్రితమే మరో నిందితుడు నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

Next Story