Triple Murder: బుర్ఖా లేకుండా బయటకు వెళ్లిందని భార్య, పిల్లల్ని చంపిన భర్త.. వారం తర్వాత బిగ్ ట్విస్ట్

by Prasad Jukanti |   (  Updated:2025-12-17 12:59:56  IST  )

భర్త కోసం భార్యతో పాటు ఇద్దరు కూతుర్ల నిండు ప్రాణాలు బలి తీసుకుంది.

Triple Murder: బుర్ఖా లేకుండా బయటకు వెళ్లిందని భార్య, పిల్లల్ని చంపిన భర్త.. వారం తర్వాత బిగ్ ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భార్య భర్తల మధ్య చెలరేగిన గొడవ ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. భార్య చేసిన పని అవమాన భారంగా భావించిన ఓ భర్త తన భార్య, ఇద్దరు పిలల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన యూపీలోని షామ్లి జిల్లాలో (UP Shamli District) చోటు చేసుకుంది. ఫరూఖ్, తాహిరా (35) భార్య భర్తలు, వీరికి షరీన్ (14), అఫ్రీన్ (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తాహిరాతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు వారం రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ఉన్నట్టుండి ముగ్గురి అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో నిన్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు అనుమానంతో ఫరూఖ్‍ను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవమాన భారం:

తనకు కొంత డబ్బు కావాలని తాహిరా తన భర్త ఫరూక్ ను అడిగింది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్తపై కోపంతో తాహిరా బుర్ఖా ధరించకుండానే (Burqa Controversy) బయటకు వెళ్లిపోయింది. అది అవమానంగా భావించిన భర్త ఆమెను చంపేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఓ ఫిస్టల్ ను కొనుకుని వచ్చి తన భార్యను చంపేశాడు. అయితే అప్పుడే నిద్ర లేచిన తన ఇద్దరు కుమార్తెలను సైతం కోపంతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తన భార్య ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా ఈ ముగ్గురి మరణం బయటకు తెలియకుండా ఇంట్లోనే గొయ్యి తీసి అక్కడే వారిని పాతిపెట్టాడు. ముగ్గురు కనిపించకపోవడంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ఫరూక్ నిజం ఒప్పుకున్నాడని, నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా భార్య భర్తల మధ్య గొడవలో అమాయక పసిపిల్లులు బలికావడం స్థానికంగా మరింత విషాదాన్ని నింపింది.

Next Story