- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంపేస్తామంటూ కేంద్రమంత్రికి బెదిరింపులు
లోక్ జనశక్తి (LJP) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)కు హత్యా బెదిరింపులు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: లోక్ జనశక్తి (LJP) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)కు హత్యా బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా చిరాగ్‌ను చంపేస్తామంటూ దుండగులు పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని LJP ప్రతినిధి రాజేశ్ భట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 'టైగర్ మెరాజ్ ఇడిసి' అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో హత్య బెదిరింపు పోస్టులు పెట్టారని రాజేశ్ తెలిపారు. చిరాగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగానే ఈ బెదిరింపులు వచ్చాయన్నారు.
ఈ బెదిరింపులపై పట్నాలోని సైబర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశామని, సంబంధిత వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రాజేశ్ భట్ తెలిపారు. బెదిరింపు వెనక తీవ్రతను దృష్టిలోపెట్టుకొని పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అభ్యర్థించినట్లు తెలిపారు. అయితే, ఆ ఇన్‌స్టా అకౌంట్ ఫేక్ అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
కాగా.. ఈ ఏడాది చివర్లో బిహార్ (Bihar)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇటీవల చిరాగ్ ప్రకటించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి కారణమైన బిహార్ ప్రజల కోసం పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హత్యా బెదిరింపులు రావడం గమనార్హం.






