‘ఆనాడు చీర లాగింది మీరు కాదా?’.. ఇండియా ఎంపీపై నిర్మలా సీతారామన్ ఫైర్

by Dishafeatures2 |
‘ఆనాడు చీర లాగింది మీరు కాదా?’.. ఇండియా ఎంపీపై నిర్మలా సీతారామన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ నడుస్తోంది. ఇక ఈనాటి చర్చలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ లోక్ సభకు హాజరయ్యారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో మహిళలపై దాడులు పెగిగాయంటూ డీఎంకే సభ్యురాలు కనిమొళి అన్నారు. దీంతో నిర్మలా సీతారామన్ వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కౌరవ సభ, ద్రౌపది అంటూ డీఎంకే సభ్యురాలు మాట్లాడుతున్నారని, జయలలిత ఘటనను మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. 1989లో తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీరను లాగేందుకు ప్రయత్నించి ఆమెను ఘోరంగా అవమానించింది డీఎంకే ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని ఛాలెంజ్ చేసిన జయలలిత.. అన్నట్లుగానే రెండేళ్లలో సీఎం అయ్యి అక్కడి అసెంబ్లీలో అడుగుపెట్టారని గుర్తు చేశారు. మహిళలపై ఎక్కడ దాడులు జరిగినా ఖండించాల్సిందేనని, అయితే ఈ విషయాలను రాజకీయం చేయవద్దని సూచించారు. సెంగోల్ రాజదండాన్ని కొత్త పార్లమెంట్ ప్రతిష్టింపజేసి ప్రధాని మోడీ తమిళ ప్రజలను ఎంతో గౌరవిచ్చారన్నారు.

Read More : నిర్మలా సీతారామన్ మాట్లాడుతుండగా ‘ఇండియా’ ఎంపీలు వాకౌట్!


Next Story