నిర్మలా సీతారామన్ మాట్లాడుతుండగా ‘ఇండియా’ ఎంపీలు వాకౌట్!

by Disha Web Desk 2 |
నిర్మలా సీతారామన్ మాట్లాడుతుండగా ‘ఇండియా’ ఎంపీలు వాకౌట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితికి చేరిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై గురువారం మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. యూపీఏ హయాంలో ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కానీ బీజేపీ ప్రభుత్వ హయంలో ప్రజలు ఇంకా ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితికి చేరిందన్నారు. తమ బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లే మేరుగైందన్నారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా వికాస్ ప్రయాస్ ద్వారా ఆర్థిక విధానాలను మెరుగుపర్చుకున్నాం. కరోనా తర్వాత ఆర్థిక రికవరీ మార్గంలో ఉన్నట్టుగా ఆమె వెల్లడించారు. యూపీఏ సర్కార్ పదేళ్ల కాలాన్ని వృధా చేసిందని, విపక్ష కూటమి ఇండియాపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఐక్యంగా పోరాడటంలో విపక్ష పార్టీలు వైఫల్యం చెందారని, తమలో తాము పోరాటం చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. కేంద్ర మంత్రి అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, ఎన్‌సీపీ, డీఎంకే ఎంపీలు వాకౌట్ చేశారు.

Next Story

Most Viewed