లావణ్య బాధ్యత నాదే.. హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పద్మావతి

by Disha Web Desk 1 |
లావణ్య బాధ్యత నాదే.. హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పద్మావతి
X

దిశ, కోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం స్టేజి వద్ద ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందడం బాధిత కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చిన సంగతి విదితమే. ఈ మేరకు మృతుల కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు ఎమ్మెల్యే పద్మావతి‌ రెడ్డి బుధవారం మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి వెళ్లారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకే కుటుంబంలో ఆరుగురుని కోల్పోవడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుడు శ్రీకాంత్ చిన్న కూతురు లావణ్యకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని, తన చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని అన్నారు.

అదేవిధంగా మృతుడి భార్య నాగమణి చికిత్సకు సంబంధించి వైద్య ఖర్చులను మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన మృతుడు శ్రీకాంత్ అక్క, బావ, కృష్ణంరాజు, స్వర్ణ కుమారి ప్రమాదంలో చనిపోవడంతో వారి పిల్లలు అనాథలవ్వడం బాధాకరమని అన్నారు. వారి చదువులకు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు భరిస్తాన పద్మావతి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవూరి వెంకటాచారి, నాయకులు కొత్త గురవయ్య, కొండా పూర్ణ, తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed