- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పట్లో ఉగ్రవాదులు చంపి వెళ్లిపోయేవారు.. నాటి కాంగ్రెస్ పాలనపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
2014 కంటే ముందు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ప్రజలను చంపి పరారయ్యేవారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్లో పర్యటించిన ఆయన నాటి కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: 2014 కంటే ముందు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ప్రజలను చంపి పరారయ్యేవారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్లో పర్యటించిన ఆయన నాటి కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదులు మూడుసార్లు అతిపెద్ద దాడులు చేయగా.. మోదీ ప్రతి దాడికి సమాధానం ఇచ్చారని, అది మోదీ పవర్ అని కొనియాడారు. ఉరి దాడికి సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes), పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రైక్స్ (Air Strikes), పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమాధానాలని స్పష్టం చేశారు. నేడు మనమంతా ఇలా గర్వంగా తలెత్తుకుని ఉండటానికి కారణం సైన్యమేనన్నారు. భారత్ ఎప్పుడూ అణు బెదిరింపులకు భయపడదని పేర్కొన్నారు.
ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం చేసిన దాడికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనే పేరు పెట్టింది ప్రధాని నరేంద్ర మోదీనే అని తెలిపారు. భారత ఆర్మీ (Indian Army) పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిందని చెప్పారు. పాకిస్థాన్ కశ్మీర్ నుంచి కచ్ వరకూ పలుమార్లు దాడులకు ప్రయత్నించినా.. సైన్యం వాటిని ఎదుర్కొని, విఫలం చేశాయన్నారు. పాక్ ఎయిర్ బేస్ (PAK Air Base)ను కూడా ధ్వంసం చేసిందని తెలిపారు. గాంధీనగర్ లో రూ.1100 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మూడు గృహ నిర్మాణ పథకాల డ్రా తీసి, వావోల్ సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.






