కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఇక రేషన్ పంపిణీలో సరికొత్త సంస్కరణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-27 15:03:28  IST  )

దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఇక రేషన్ పంపిణీలో సరికొత్త సంస్కరణలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత ఆధునీకరించడానికి, పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ముఖ్యమైన పంపిణీ, సాంకేతిక పథకాలను విలీనం చేస్తూ.. ‘సార్థక్-పీడీఎస్’ అనే సరికొత్త పథకానికి ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. అయితే, ఆహార భద్రత, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గతంలో ఉన్న రెండు ప్రధాన విభాగాలను ఈ కొత్త పథకంలో విలీనం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద రాష్ట్రాల పరిధిలో ఆహార ధాన్యాల రవాణా, రేషన్ దుకాణాల (FPS) డీలర్ల మార్జిన్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం చేయనున్నారు. టెక్నాలజీతో ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే పథకమే ‘స్మార్ట్ పీడీఎస్’ (SMART PDS) పథకం.

‘సార్థక్-పీడీఎస్’ పథకం ఎందుకు..

రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం (Aadhaar Seeding), ఈ-పోస్ (e-PoS) పరికరాల ద్వారా రేషన్ దుకాణాల ఆటోమేషన్‌ను ఈ పథకం మరింత ముందుకు తీసుకెళ్తుంది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆన్‌లైన్ కేటాయింపులు, కంప్యూటరైజ్డ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌ను ఈ ప్రాజెక్ట్ సులభతరం చేయనుంది. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి, అర్హులైన వారికే లబ్ధి చేకూర్చడానికి ఈ పథకం దోహదపడుతుంది. ఇందులో భాగంగా ‘మేరా రేషన్’ (Mera Ration), ‘అన్న మిత్ర’, ‘అన్న సహాయత’ వంటి యాప్‌లతో పాటు ‘రైట్‌ఫుల్ టార్గెటింగ్ డ్యాష్‌బోర్డ్’ సేవలు లబ్ధిదారులకు మరింత చేరువ కానున్నాయి.

Next Story