- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపే చాన్స్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్న వేళ కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్న వేళ కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా భారత బీమా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచే ఇన్సూరెన్స్ లాస్ బిల్-2025 (Insurance Laws Bill-202)కు ఆమోదం తెలుపనున్నట్లుగా కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి.
ఈ బిల్లుతో ఇన్సూరెన్స్ యాక్ట్-1938, ఎల్ఐసీ యాక్ట్ - 1956, IRDAI యాక్ట్-1999లకు సవరణలు చేయనున్నారు. ఎఫ్‌డీఐ పరిమితి పెంపు కాకుండా, కాంపోజిట్ లైసెన్స్‌లు, లైసెన్సింగ్ నిబంధనల సరళీకరణ, గవర్నెన్స్ అంశాల్లో మార్పలు ఉండనున్నాయి. తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఎఫ్‌డీఐ బిల్లుతో బీమా రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. బీమా విస్తరణ పెరి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై-2047 లక్ష్యం సులువు అవుతంది. దేశంలో కొత్త కంపెనీల ఎంట్రీతో పోటీ పెరిగి, పాలసీ హోల్డర్లకు మెరుగైన సేవలు, ధరలు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఆర్థిక వృద్ధికి ఎఫ్‌డీఐ బిల్లు దోహదపడనుంది.






