ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. వొడాఫోన్-ఐడియాకు బిగ్ రిలీఫ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-31 11:00:36  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది.

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. వొడాఫోన్-ఐడియాకు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేటు టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ ఐడియాకు ఊరట కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

వోడాఫోన్ ఐడియాకు చెందిన రూ. 87,695 కోట్ల AGR (Adjusted Gross Revenue) బకాయిలను డిసెంబర్ 31, 2025 నాటికి ఫ్రీజ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బకాయిల మొత్తాన్నిఫైనాన్షియల్ ఇయర్ 2031-32 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2040-41 వరకు (10 సంవత్సరాలు) చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. మొదటి 5 సంవత్సరాలు వడ్డీ లేకుండా పేమెంట్ వాయిదా ఉంటుంది. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఫైనల్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ 2017-18, ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 బకాయిలు మార్పు లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2030-31 మధ్య బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది. అదేవిధంగా రూ.19,142 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గ భేటీలో ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్ల కాలంలో నాసిక్ - సోలాపూర్- అకల్‌కోట్ కారిడార్‌ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నాసిక్ - షోలాపూర్ కారిడార్‌ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది.

Next Story