- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Cabinet: ఆరు లేన్ల రింగ్ రోడ్‌కు ఆమోదం.. రూ.8307 కోట్లు మంజూరు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం(Union Cabinet)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం(Union Cabinet)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కటక్ - భువనేశ్వర్ ఆరు లేన్ల రింగ్ రోడ్(Ring Road)కు కేబినెట్‌లో ఆమోదం లభించింది. ఈ రింగ్ రోడ్‌కు కేంద్రం రూ.8307 కోట్లు మంజూరు చేసింది. అంతేకాదు.. కోటాలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ఎయిర్‌పోర్టుకు రూ.1507 కోట్లు మంజూరు చేసింది. మంత్రివర్గంలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ వలన జరిగిన నష్టంపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వోద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దీపావళి నుంచి జీఎస్టీ సంస్కరణలను తీసుకు వస్తామని ప్రధాని మోడీ ఆగష్టు 15వ తేదీన ప్రకటించడంతో దానిపై కూడా చర్చ చేసినట్లు సమాచారం.
Next Story






