- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UGC regulations: యూజీసీ ముసాయిదా రాజ్యాంగ విరుద్ధం.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
వైస్ చాన్సలర్ల ఎంపికకు సంబంధించి ఇటీవల యూజీసీ విడుదల చేసిన ముసాయిదా నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని మహువా మొయిత్రా అభివర్ణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల ఎంపికకు సంబంధించి ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (Ugc) విడుదల చేసిన ముసాయిదా నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా (Mahuva moitra) అభివర్ణించారు. వీసీల సెలక్షన్ కమిటీ ప్రమాణాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెంటులో జీరో అవర్ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు రాష్ట్రాలు నిధులు సమకూరుస్తాయని, కానీ వీసీల నియామకానికి చెందిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి లేకపోవడం సరైంది కాదన్నారు. యూజీసీ రూల్స్ 2018 స్థానంలో తీసుకురావడానికి ఉద్దేశించిన యూజీసీ 2025 ముసాయిదా పూర్తి రాజ్యాంగ వ్యతిరేకమని నొక్కి చెప్పారు. దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే దేశంలో విద్యా ప్రమాణాలు దెబ్బతినే చాన్స్ ఉందన్నారు.
కాగా, యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రకారం, పరిశ్రమ నిపుణులు, అలాగే ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీనియర్ నిపుణులు వైస్ చాన్సలర్లుగా నియామకానికి అర్హులు. వీరిని నియమించడానికి ముగ్గురు సభ్యుల సెర్చ్-కమ్-సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడానికి ముసాయిదా నిబంధనలు అధికారాన్ని ఇచ్చాయి. అంతేగాక విశ్వవిద్యాలయాలలో అధ్యాపక సభ్యులను నియమించడానికి నిబంధనలను కూడా సవరించాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55శాతం మార్కులు ఉన్న వారు యూజీసీ నెట్ అర్హత సాధించకుండానే నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎన్నికయ్యే చాన్స్ ఉంది. ఈ రూల్స్ పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని మహువా పార్లమెంటులో లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది.






