ఉద్ధవ్‌ థాక్రే అభివృద్ధికి వ్యతిరేకం: మహారాష్ట్ర సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు

by samatah |
ఉద్ధవ్‌ థాక్రే అభివృద్ధికి వ్యతిరేకం: మహారాష్ట్ర సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే అభివృద్ధికి వ్యతిరేకి అని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. బయటకు మాత్రం భారీ ప్రదర్శలు ఇచ్చారని తెలిపారు. ఆదివారం షిండే విలేకరులతో మాట్లాడారు. ముంబై నగరాన్ని అభివృద్ధి చేసింది తామేనని స్పష్టం చేశారు. ‘థాక్రే ఆరె ల్యాండ్‌లో మెట్రో కార్ షెడ్‌ను, మెట్రో లైన్ల నిర్మాణాన్ని వ్యతిరేకించాడు. ముంబై- నాగ్‌పూర్‌లను కలుపుతూ నిర్మిస్తున్న హైవేనూ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు’ అని తెలిపారు. ‘ముంబై ట్రాన్స్-హార్బర్ లింక్ దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన. దీని నిర్మాణానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. ఈనెల12న ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తారు’ అని తెలిపారు.

Advertisement

Next Story