- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
23 లక్షలకు గోల్డెన్ వీసా వార్తలన్నీ బూటకం.. తేల్చిచెప్పిన యూఏఈ!
రూ.23 లక్షలు చెల్లిస్తే యూఏఈలో గోల్డెన్ వీసా అందిస్తారని వార్తలొచ్చాయి. ఇవన్నీ బూటకమేనని యూఏఈ తేల్చిచెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల ప్రజలు రూ.23 లక్షలు చెల్లిస్తే యూఏఈలో గోల్డెన్ వీసా ఇస్తారని, దీనికోసం ఇటీవలే కొన్ని కన్సల్టెన్సీలను ఎంపిక చేసిందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై యూఏఈకి చెందిన ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) స్పందించింది. గోల్డెన్ వీసా దరఖాస్తులను అధికారిక ప్రభుత్వ విభాగాలే హ్యాండిల్ చేస్తాయని, ఎలాంటి అంతర్గత లేదా బహిర్గత కన్సల్టెన్సీలకు ఈ హక్కు ఉండదని ఐసీపీ స్పష్టం చేసింది.
ఇటీవలే ‘నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా’ ప్రక్రియను టెస్ట్ చేయడానికి భారత్‌కు చెందిన రాయద్ గ్రూప్‌ను యూఏసీ ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చిన ఐసీపీ.. ఈ వార్తలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, అధికారుల ప్రమేయం లేకుండానే ఇవి ప్రచురితమయ్యాయని వెల్లడించింది. గోల్డెన్ వీసాకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు, నిర్ణయాలు అన్నీ ఇప్పటికే నిర్దేశించి ఉన్నాయని ఐసీపీ పేర్కొంది.
అధికారిక మార్గాల్లో అందే ప్రతి దరఖాస్తుకు భద్రత, పారదర్శకత అందిస్తామని యూఏఈ హామీ ఇచ్చింది. అయితే ఎలాంటి ఆధారం లేని వార్తలు నమ్మి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించింది. ఈ వార్తలు ప్రచారం చేసి డబ్బులు సేకరించేందుకు ప్రయత్నించిన సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారికంగా ప్రకటించింది.






