- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashmir: ఎల్‌వోసీలో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు దుర్మరణం
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని ఎల్‌వోసీ(LOC) వద్ద భారీ పేలుడు సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని ఎల్‌వోసీ(LOC) వద్ద భారీ పేలుడు సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం(Two Soldiers Dead) చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు భారీగా అక్కడకు చేరుకొని కూంబింగ్ మొదలు పెట్టాయి. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు.
కాగా, ఇటీవలే నార్త్ కశ్మీర్‌లోని బండిపొర జిల్లాలో ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సైనికులతో వెళ్తున్న వాహనం ఎస్‌కే పయీన్ ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా రోడ్డుపై నుంచి జారి కిందనే ఉన్న లోయలో పడింది. ఈ ఘటన మరువక ముందే బ్లాస్టింగ్ జరిగి మరో ఇద్దరు జవాన్లు మృతిచెందటం పట్ల ఆర్మీ అధికారులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.






