బ్రేకింగ్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎంపీలు వీరే..?

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎంపీలు వీరే..?
X

దిశ, వెబ్‌డెస్క్: చారిత్మ్రాక మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 454 మంది ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపగా.. ఇద్దరు ఎంపీలు ఆమోదం తెలపలేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మెజార్టీ సభ్యులు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లోక్ సభలో మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే, ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు 454 మంది ఎంపీలు మద్దతు తెలిపితే.. ఇద్దరు ఎంపీలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

దీంతో ఆ ఇద్దరు ఎంపీలు ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ మహిళా రిజర్వేషన్‌కు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సమాాచారం. కాగా, కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన రోజే.. ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ఆయన ఇవాళ్టి ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారానే మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 454 మంది ఎంపీలు మద్దతు తెలపడంతో లోక్ సభలో ఆమోదం లభించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్ సభలో చర్చ జరిగింది. దాదాపు 8 గంటలపాటు ఈ బిల్లుపై సభలో డిస్కషన్స్ జరగగా.. దాదాపు 60 మంది ఎంపీలు మాట్లాడారు. అనంతరం ఓటింగ్ జరిగింది.

Next Story

Most Viewed