- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌కు మద్దతుగా నిలిచిన టర్కీ.. భారత యాపిల్ వ్యాపారుల సంచలన నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగింది. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకొగా అనేక దేశాలు.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, భారత్ కు మద్దతుగా నిలిచాయి.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం (War atmosphere) కొనసాగింది. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకొగా అనేక దేశాలు.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, భారత్‌కు మద్దతుగా నిలిచాయి. కానీ టర్కీ మాత్రం పాక్‌కు మద్దతుగా నిలిచింది. దీంతో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన టర్కీపై పూణే, మహారాష్ట్ర ఆపిల్ వ్యాపారులు (Apple merchants) సంచలన నిర్ణయం తీసుకున్నారు. టర్కిష్ ఆపిల్‌లను బహిష్కరించాలని (Boycott of Turkish apples) నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణేలోని APMC మార్కెట్‌లో ఆపిల్ వ్యాపారి (Apple merchant) సుయోగ్ జెండే మాట్లాడుతూ.. "టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నందున మేము ఆ దేశం నుండి ఆపిల్‌లను కొనడం మానేయాలని నిర్ణయించుకున్నాము.
బదులుగా హిమాచల్, ఇతర ప్రాంతాల నుండి ఆపిల్(Apple)లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతాము. భారతదేశం ఉగ్రవాదం (terrorism)పై చర్యలు తీసుకుంటోంది. కానీ టర్కీ (Turkey) పాకిస్తాన్‌కు డ్రోన్‌లను సరఫరా చేసింది. రిటైల్ కస్టమర్లు (Retail customers) కూడా టర్కిష్ ఆపిల్‌లను కోరుకోవడం లేదని చెబుతున్నారు. వాటిని చూసి, మేము కూడా టర్కిష్ ఆపిల్‌లను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాము. టర్కిష్ ఆపిల్‌ల(Turkish apple)ను ఇక్కడ 3 నెలలు అమ్ముతారు. ఈ వ్యాపారం దాదాపు రూ. 1200-1500 కోట్ల విలువైనది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు, వారికి సహాయం చేసిన మొదటి దేశం భారతదేశం, కానీ వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చి వారి వక్ర బుద్దిని నిరూపించారు." అని చెప్పుకొచ్చారు.






