- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో ఐఫోన్ల తయారీ మీ ఇష్టం.. టారిఫ్ తప్పదు: ట్రంప్
భారత్‌లో ఐఫోన్ల తయారీ మీ ఇష్టం అని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే 25 శాతం టారిఫ్ మాత్రం తప్పదన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఐఫోన్లను భారత్‌లో తయారు చేయడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో మరేదైనా దేశంలో తయారు చేసిన ఐఫోన్లను యూఎస్‌లో అమ్మితే 25 శాతం టారిఫ్ వేస్తానని ఇటీవలే ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూఎస్ న్యూక్లియర్ శక్తిని పెంచడం కోసం కొన్ని కీలక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఐఫోన్ల తయారీ గురించి స్పందించాడు. ‘నేను టిమ్ కుక్‌తో ఈ విషయం చర్చించాను. తను ప్లాంట్ల నిర్మాణం కోసం భారత్‌కు వెళ్తున్నానని చెప్పాడు. అయితే ఇండియా వెళ్లు, కానీ ఇక్కడ యూఎస్‌లో వాటిని అమ్మాలంటే 25 శాతం టారిఫ్ తప్పదని కరాఖండీగా చెప్పా. యూఎస్‌లో అమ్మే ఐఫోన్లు ఇక్కడే తయారు చేయలనేది నా వాదన’ అని ట్రంప్ స్పష్టం చేశాడు.
కేవలం యాపిల్ కంపెనీనే కాకుండా ఇతర ఫోన్లు కూడా అమెరికాలో అమ్మాలంటే వాటిని యూఎస్‌లోనే తయారు చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో శాంసంగ్ వంటి బడా కంపెనీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే షేర్ మార్కెట్లో యాపిల్ కంపెనీ షేర్ల ధరలు తగ్గాయి. అయితే యాపిల్ వంటి కంపెనీలకు యూఎస్‌లో తయారు చేయడం కన్నా భారత్ వంటి దేశాల్లో మ్యానుఫాక్చరింగ్ చేయడం వల్లనే లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. యూఎస్‌లో సరైన నైపుణ్యం ఉన్న ఇంజినీర్ల కొరత ఉందని, అదే ఇంజనీర్లు భారత్‌లో పుష్కలంగా ఉండటంతోపాటు తక్కువ జీతానికే పనిచేస్తారని వారు చెప్తున్నారు. కాబట్టి ట్రంప్ 25 శాతం సుంకం విధించినా యాపిల్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంటున్నారు. మరి ట్రంప్ నిర్ణయాలపై ఆయా కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.






