Gold: బంగారంపై సుంకాల విషయంలో ట్రంప్ కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-08-12 11:14:25  IST  )

ప్రపంచ దేశాలపై టారిఫ్ విధిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు.

Gold: బంగారంపై సుంకాల విషయంలో ట్రంప్ కీలక  ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాలపై టారిఫ్ (USA Tariffs) విధిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. పలు దేశాలను ఆందోళనలోకి నెడుతున్న ట్రంప్... బంగారం దిగుమతులపై ఎలాంటి సుంకాలు విధించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్ట్ చేశారు. గత వారం భారత్‌పై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించి షాకిచ్చారు. ఈ క్రమంలో అమెరికా దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై (Gold Bars) సుంకాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో దీనిపై ట్రంప్‌ వివరణ ఇస్తూ సుంకాలు విధించబోమని స్పష్టం చేశారు. అమెరికా కస్టమ్స్ విభాగం గత వారం రిలీజ్ చేసిన ప్రకటనలో ఒక కేజీతో పాటు 100 ఔన్సుల(2.8 కిలోల) బంగారు కడ్డీలు సంకాల పరిధిలోకి వస్తాయని పేర్కొంది. దీంతో మార్కెట్ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ట్రంప్‌ తాజా ప్రకటనతో బంగారం దిగుమతులపై సుంకాలు ఉండబోవని స్పష్టమైంది.

Next Story