Trump: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేది వీరే?

by vinod kumar |
Trump: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేది వీరే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోమవారం ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రముఖుల వివరాలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి ట్రంప్ సన్నిహితులు, భారత్ సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ముఖ్యంగా ట్రంపుతో సన్నిహితంగా ఉన్న రైట్ వింగ్, పాపులిస్ట్ నాయకులకు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ, హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్, ఈక్వెడార్ ప్రెసిడెంట్ డేనియల్ నోబోవా, ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నయీబ్ బుకెలేలు ఉన్నారు. ఇక, భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) హాజరుకానున్నారు.

అలాగే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్‌లకు సైతం ఆహ్వానం అందినట్టు వారు తెలిపారు. అయితే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. అలాగే జర్మనీ అధ్యక్షుడు ఓలాఫ్ స్కోల్జ్‌కు ఆహ్వానం అందకపోగా అదే దేశం నుంచి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ (AfD) నాయకురాలు అలిస్ వీడెల్‌కు ఆహ్వానం అందింది. ఇక ట్రంపుతో స్నేహ పూర్వక సంబంధాలున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సైతం ఇన్విటేషన్ అందలేదు. ఫ్రాన్స్ నుంచి రీకాంక్వెస్ట్ పార్టీకి చెందిన తీవ్రవాద రాజకీయ నాయకుడు ఎరిక్ జెమ్మూర్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. అంతేగాక వ్యాపాద దిగ్గజాలైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, టిక్ టాక్ సీఈఓ షో వంటి వారు కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed