Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన

by B.Srinivas |

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తే మళ్లీ దాడులకు పాల్పడతామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ (Iran) తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తే మళ్లీ దాడులకు పాల్పడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్‌లో యూరేనియం శుద్ది చేయొద్దని, దీనిని సుసంపన్నం చేయాలని భావిస్తే దానిని జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అణు బాంబులను తయారు చేయాలనుకోవడం లేదని భావిస్తున్నట్టు తెలిపారు. ఇరాన్ పై అమెరికా దాడి యుద్ధాన్ని ముగించిందని, తద్వారా ఇరాన్ అణు ప్రోగ్రామ్ దశాబ్దాల వెనుకకు నెట్టివేయబడిందని తెలిపారు. మూడు కీలక అణు కేంద్రాలపై చేసిన దాడులతో టెహ్రాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు.

అమెరికా దాడులకు ముందు ఇరాన్ అణు కేంద్రాల నుంచి 400 కిలోగ్రాముల యురేనియం తొలగించబడిందని వెలువడిన నివేదికలపై ట్రంప్ స్పందిస్తూ.. ఆ కథనాలన్నీ నకిలీవని కొట్టి పారేశారు. ఇరాన్ అణు బాంబులను తయారు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. కాగా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం అనంతరం ఇరు పక్షాలు సీజ్ ఫైర్ కు అంగీకరించడంతో దాడులు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story