- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: చైనాతో మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్
by B.Srinivas |
చైనాతో మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. వాషింగ్టన్‌లో గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Jajiya melony) తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. తమతో ఎవరూ పోటీ పడలేరని, చైనాతో త్వరలోనే మంచి అగ్రిమెంట్ పొందబోతున్నామని స్పష్టం చేశారు. అమెరికాతో సమావేశానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. మెక్సికో అధ్యక్షుడితో భేటీలో సానుకూల చర్చలు జరిపానని, అలాగే జపాన్ వ్యాపార ప్రతినిధులను కూడా కలిశానని గుర్తు చేశారు. చైనాతో సహా ప్రతి దేశం తమతో కలవాలని కోరుకుంటుందని తెలిపారు. చైనా చర్చలకు రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, చైనాపై 245 శాతం సుంకాలు విధిస్తున్నట్టు వైట్ హౌస్ (White house) వెల్లడించిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Next Story






