iPhone: ఐఫోన్ లవర్స్ కు బిగ్ షాక్!.. ట్రంఫ్ దెబ్బకు బ్రాండ్ మారాల్సిందేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-04-04 06:38:23  IST  )

అమెరికా టారిఫ్ వార్ లో ఐఫోన్ ధరలకు రెక్కలు

iPhone: ఐఫోన్ లవర్స్ కు బిగ్ షాక్!.. ట్రంఫ్ దెబ్బకు బ్రాండ్ మారాల్సిందేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రంప్ తీసుకున్న టారిప్ (US tariffs) నిర్ణయం ప్రపంచ మార్కెట్లలో టెర్రర్ సృష్టిస్తోంది. ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ (Trump) తాజాగా ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తాజాగా ఐఫోన్ లవర్స్ కు షాకింగ్ గా మారింది. యూఎస్ ప్రభుత్వం విధించిన తాజా సుంకాలతో ఐఫోన్ ధరలు (iPhone prices hike) గణనీయంగా పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్లు చైనాలో తయారవుతున్నాయి. టారిఫ్ జాబితాలో చైనా పై 34 శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ అధనపు టారిఫ్ భారం ఐఫోన్ల ధరలపై పడనున్నాయి.

ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు (రూ.68 వేలు) టారిఫ్ భారం వినియోగదారులపైనే మోపితే ఇది 1,142 డాలర్లు (రూ.97 వేలు) చేరుకుంటుంది. ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ (1టెరాబైట్ మోడల్) 2,300 డాలర్లకు (రూ.2 లక్షలకు) చేరవచ్చని అంచనావేస్తున్నారు. అయితే టారిఫ్ ఎఫెక్టుతో పెరగనున్న ధరలను తామే భరించడమా లేక వాటిని వినియోగదారులపై మోపడమా అనేది యాపిల్ సంస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పన్నుల భారం వినియోగదారులకే బదలాయిస్తే కస్టమర్లు ఇతర బ్రాండ్ ఫోన్ల వైపు మళ్లే అవకాశం ఉందని తద్వారా ఐఫోన్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న శాంసంగ్ (Samsung) కు లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ మార్కెట్ వర్గాల్లో జరుగుతోంది.

Next Story