Trump: చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం.. ట్రంప్ పుతిన్ భేటీపై భారత్ ప్రశంసలు

by B.Srinivas |

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఉత్తమ మార్గం నేరుగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Trump: చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం.. ట్రంప్ పుతిన్ భేటీపై భారత్ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఉత్తమ మార్గం నేరుగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం కావడం తక్కువేనని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని తెలిపారు. ‘రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధాన్ని ఆపడానికి శాంతి ఒప్పందానికి వెళ్లడమే మంచిదని అందరూ నిర్ణయించారు. ఈ పరిణామంతోయుద్ధం ముగుస్తుంది’ అని పేర్కొన్నారు. పుతిన్‌తో సానుకూల సమావేశం జరిగిందని తెలిపారు.

అలస్కాలో ట్రంప్, పుతిన్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతించింది. ముందకు సాగడానికి ఏకైక మార్గం చర్చలు, దౌత్యం మాత్రమేనని తెలిపింది. ‘అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలస్కాలో జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతిస్తోంది. శాంతి నెలకొల్పే దిశగా వారి భేటీ ఎంతో ప్రశంసనీయం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘శిఖరాగ్ర సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తోంది. చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే ముందుకెళ్లొచ్చు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న భీకర యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకడం ప్రపంచం చూడాలనుకుంటున్నది’ అని పేర్కొంది.

Next Story