- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: సుంకాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారీఫ్‌లు (Tariffs) విధించనున్నట్లు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారీఫ్‌లు (Tariffs) విధించనున్నట్లు వెల్లడించారు. న్యూఓర్లీన్స్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్ సూపర్ బౌల్ కార్యక్రమానికి వెళ్తూ ట్రంప్ (Trump) తన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే టారీఫ్ ల గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. ప్రకటించిన వెంటనే టారీఫ్ లు అమల్లోకి వస్తాయన్నారు. అయితే, ఏ దేశానికి సుంకాలు విధిస్తున్నారనే విషయంపై స్పష్ట ఇవ్వలేదు. ‘‘మా నుంచి వసూలుచేస్తే.. మేం కూడా తిరిగి వసూలుచేస్తాం’’ అని ట్రంప్ అన్నారు. ఇకపోతే, 2016-2020 మధ్య ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25శాతం సుంకాలు విధించారు. అయితే, ఆ తర్వాత కెనడా, మెక్సికో, బ్రెజిల్ లాంటి వాణిజ్య భాగస్వాములకు టారీఫ్ ల నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం.. టారీఫ్ రహిత కోటాలను బ్రిటన్, జపాన్, ఐరోపా సమాఖ్యకు విస్తరించారు.
స్టీల్ ఉత్పత్తులు ఎక్కడ్నుంచి వస్తున్నాయంటే?
అయితే, ప్రస్తుతం అమెరికా దిగుమతి చేసుకుంటున్న స్టీల్ ఉత్పత్తుల్లో అధిక శాతం కెనడా, బ్రెజిల్, మెక్సికో నుంచి వస్తున్నాయి. దక్షిణ కొరియా, వియత్నాం నుంచి కూడా స్టీల్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఇక, అమెరికాకు కెనడా నుంచే అత్యధికంగా అల్యూమినియం సరఫరా అవుతోంది. 2024లో అగ్రరాజ్యం దిగుమతి చేసుకున్న మొత్తం అల్యూమినియంలో దాదాపు 79శాతం కెనడా నుంచి వచ్చింది. అయితే, ట్రంప్ టారీఫ్ ల గురించి ప్రస్తావించగా.. ఈ దేశాలపైనే భారం పడనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం.. అమెరికా సుంకం రేటు సగటున 2.2 శాతంగా ఉంది. ఇది భారతదేశానికి 12 శాతం, బ్రెజిల్‌కు 6.7 శాతం, వియత్నాంకు 5.1 శాతం, యూరోపియన్ యూనియన్ దేశాలకు 2.7 శాతంగా ఉంది.






