- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెక్సికోపై టారిఫ్‌లు నెలపాటు నిలిపివేత
సోమవారం డల్‌గా ప్రారంభమైన అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రంప్ ప్రకటనతో ఒక్క సారిగా ఊపందుకొని నష్టాల నుంచి లాభాల వైపు పరుగులు తీశాయి.

- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో:
మెక్సికోపై అమెరికా ప్రభుత్వం విధించిన 25 శాతం టారిఫ్‌ను నెల పాటు నిలిపివేశారు. మెక్సికో నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అయితే మెక్సికోలోని అమెరికా సరిహద్దు వద్దకు 10వేల మంది సైనికులను పంపిస్తున్నామని, వాళ్లు అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకుంటారని ఆ దేశ ప్రధాని క్లౌడియా షిన్బామ్ తెలిపారు. దీంతో మెక్సికోపై తాత్కాలికంగా టారిఫ్ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. మెక్సికో, కెనడాపై 25 శాతం, చైనాపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు గత వారం ట్రంప్ ప్రకటించారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో మెక్సికోకు నెల రోజుల పాటు ఊరట లభించింది. కాగా, సోమవారం డల్‌గా ప్రారంభమైన అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రంప్ ప్రకటనతో ఒక్క సారిగా ఊపందుకొని నష్టాల నుంచి లాభాల వైపు పరుగులు తీశాయి.






