- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: ఆపరేషన్ ముగిసింది రోగి కోలుకుంటున్నాడు.. సుంకాల విధింపు అనంతరం ట్రంప్ కీలక పోస్ట్
వివిధ దేశాలపై టారిఫ్స్ విధించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: వివిధ దేశాలపై టారిఫ్స్ విధించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ ముగిసిందని, పేషెంట్ కోలుకుంటున్నాడని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్ (Truth social) లో పోస్ట్ చేశాడు. ‘ఆపరేషన్ ముగిసింది. రోగి బతికే ఉన్నాడు. క్రమంగా కోలుకుంటున్నాడు. ఇప్పుడు రోగి గతంలో కంటే ఎంతో బలంగా, పెద్దగా, మెరుగ్గా, మరింత ఆచరణాత్మకంగా ఉంటాడని అంచనా వేస్తున్నాం. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దండి’ అని పేర్కొన్నారు. కాగా, భారత్ సహా వివిధ దేశాలపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
యూఎస్ వాహన దిగుమతులపై 25 శాతం సుంకాలు: కెనడా రివేంజ్ టారిఫ్స్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా విధించిన పరస్పర సుంకాలపై కెనడా (Canada) తీవ్రంగా స్పందించింది. ట్రంప్ టారిఫ్స్‌కు రివేంజ్‌గా అమెరికా వాహన దిగుమతులపై 25శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ (Mark carney) ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందానికి అనుగుణంగా లేని అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వాహనాలపై 25శాతం సుంకం విధించనున్నట్టు తెలిపారు. కొత్త సుంకాలు ఆటో పార్ట్స్‌కు వర్తించబోవని, మెక్సికో నుండి వచ్చే వాహనాలను సైతం ప్రభావితం చేయబోవని చెప్పారు. అమెరికా తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.






