Trump: భారత్ పాక్ ఘర్షణను నేనే ఆపా.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |   (  Updated:2025-07-19 17:22:52  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపరేషన సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump: భారత్ పాక్ ఘర్షణను నేనే ఆపా.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) పై కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ఐదు జెట్లు కూలిపోయాయని తెలిపారు. వాటిని గాలిలోనే పేల్చేశారని చెప్పారు. వైట్ హౌస్ లో రిపబ్లికన్ సెనేటర్లకు ఇచ్చిన విందులో ట్రంప్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ టైంలో ఐదు విమానాలను గాలిలోనే పేల్చి వేసినట్టు భావిస్తున్నానని తెలిపారు. అయితే ఏ దేశ విమానాలు కూలిపోయాయనే విషయంపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. తన జోక్యం తర్వాతే భారత్ పాక్ మధ్య ఘర్షణ ఆగిపోయినట్టు మరోసారి పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించిందని కొనియాడారు. అనేక తీవ్రమైన యుద్ధాలను ఆపామని నొక్కి చెప్పారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ట్రంప్ కామెంట్స్ పై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Next Story